బుల్లితెర మీద నవ్య స్వామికి మంచి క్రేజ్ ఏర్పడింది. అంతే కాదు సోషల్ మీడియాలో కూడా ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె కథ సీరియల్‌తో రవి కృష్ణ, నవ్యస్వామి ఆడియన్స్ కి రొమాంటిక్ పెయిర్ గా బాగా దగ్గరయ్యారు. ఆ సీరియల్‌తో నవ్య స్వామి పేరు ఎక్కడికో వెళ్ళిపోయింది. వీళ్ళ జోడి మీద లెక్కలేనన్ని రూమర్లు వచ్చాయి. సీరియల్‌లో కెమిస్ట్రీ కుదిరి, ఆఫ్ స్క్రీన్‌లోనూ రొమాన్స్ చేయడంతో అందరూ ఫిదా అయ్యారు. కానీ కొంత కాలం నుంచి వీళ్ళు అస్సలు కలిసి వర్క్ చేయడం లేదు..ఎక్కడ కూడా కలిసి కనిపించడం లేదు. నవ్య స్వామి మాత్రం తన దారి తాను చూసుకున్నట్టు తెలుస్తోంది. తాను మూవీస్ కి ప్రమోట్ అయ్యేసరికి రవిక్రిష్ణను వదిలేసింది అంటూ నెటిజన్స్ తెగ ఫీల్ అవుతున్నారు.
ఇక ఇప్పుడు "బుట్టబొమ్మ" మూవీలో నటించింది నవ్య స్వామి. అలాగే ఆమె టూర్స్ మీద టూర్స్ వెళ్తోంది. రీసెంట్ గా కాశ్మీర్ వెళ్లిన నవ్య అక్కడి అందాలను బంధించి ఆ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది. ఇక ఇప్పుడు అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యింది. తాను స్టే చేసిన ప్లేస్ ని ఫోటో తీసి "రాత్రి ఈ గదిలోంచి కాశ్మీర్ అందాలను చూడడం చాలా బాగుంది" అని కామెంట్ చేసింది.
ఇక విమానం ఎక్కేసి "కాశ్మీర్ ని వదలబుద్ది కావడం లేదు..కానీ తప్పదు ..గుడ్ బై కాశ్మీర్" అంటూ ఒక పోస్ట్ పెట్టింది. మొత్తానికి నవ్యస్వామి కి కొత్త ఏడాది బాగా కలిసి వచ్చినట్టుగా కనిపిస్తోంది.